Love Marriage: కూతురు ప్రేమ వివాహం.. కానిస్టేబుల్ దంపతుల ఆత్మహత్య
Love Marriage: చిన్ననాటి నుంచి కూతురును అల్లారుముద్దుగా చూసుకుని ఆమె భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ తల్లిదండ్రులు కూతురు తీసుకున్న నిర్ణయంతో హతాశులయ్యారు.
Love Marriage: కూతురు ప్రేమ వివాహం.. కానిస్టేబుల్ దంపతుల ఆత్మహత్య
Love Marriage: చిన్ననాటి నుంచి కూతురును అల్లారుముద్దుగా చూసుకుని ఆమె భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ తల్లిదండ్రులు కూతురు తీసుకున్న నిర్ణయంతో హతాశులయ్యారు. తమ పరువుకు భంగం కలిగిందని ఆవేదనకు గురయ్యారు. చివరకు భార్యాభర్తలిద్దరు ఒకే తాడుతో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం శివారులోని కైలాష్ గార్డెన్ ఆవరణలో చోటుచేసుకుంది.
వారం రోజుల క్రితం కూతురు ప్రేమ వివాహం చేసుకుందని మనస్తాపానికి గురై హత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న అడిషనల్ ఎస్పీ సృజన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతులు కానిస్టేబుల్ నారాయణ, ఆయన సతీమణి రాజేశ్వరిగా గుర్తించారు. నారాయణ గతంలో సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో పని చేయగా ప్రస్తుతం జిన్నారం లో విధులు నిర్వహిస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.