Telangana Cabinet Meet : ఇవాళ కీలక తెలంగాణ కేబినెట్ సమావేశం
ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో మంత్రివర్గ భేటీ స్థానిక సంస్థల ఎన్నికలపై జరగనున్న చర్చ ఈనెల 24లోపు స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ
Telangana Cabinet Meet : ఇవాళ కీలక తెలంగాణ కేబినెట్ సమావేశం
ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈనెల 24 లోపు స్థానిక సంస్థల ఎన్నికలపై తేల్చాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే సీఎం రేవంత్ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎలక్షన్‌పై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై కోర్టుల నుంచి వచ్చిన ఆదేశాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయంపై తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.