Telangana Coronavirus: ప్రతి ఐదుగురిలో ఒకరికి పాజిటివ్..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తుంది.

Update: 2020-06-23 08:45 GMT
Representational Image

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తుంది. రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్ కేసు మార్చి 2వ తేదీన నమోదు అయ్యింది. కాగా ఆ నెలలో మొత్తం 97 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో విదేశాల నుంచి తిరిగివచ్చిన వారు 60 మంది ఉండగా మిగిలిన వారికి ప్రైమరీ కాంటాక్ట్‌ల ద్వారా సోకినవారు, మర్కజ్ వెళ్లొచ్చిన వారు ఉన్నారు.

ఇక రాష్ట్రంలో ఏప్రిల్ 19వ తేదీ వరకు 14,962 కరోనా నిర్ధారిత పరీక్షలు చేయడా 858 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అంటే ఆసమయంలో వంద మందికి నిర్ధారిత పరీక్షలు చేస్తే వారిలో నలుగురికి కరోనా పాజిటివ్ ఉందని నిర్ధారణ అయ్యింది. దీంతో పాజిటివ్ రేట్ కేవలం 3.9 శాతంగా నమోదయింది. అది చూసిన ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చిందని కరోనా టెస్టులు చేయడం తగ్గించారు. దీంతో ఏప్రిల్ మాసం చివరి పదిరోజుల్లో కేవలం 180 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కాగా ఏప్రిల్ నెల మొత్తం కరోనా కేసుల సంఖ్య చూసుకుంటే 1038 గా నమోదయ్యాయి.

ఇక మే నెలలో కరోనా కేసుల విషయానికొస్తే 11,597 టెస్టులకు 1660 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అంటే ఏప్రిల్ నెలతో పోల్చుకుంటే కేసుల సంఖ్య పెరిగిందనే చెప్పుకోవచ్చు. దీంతో ఏప్రిల్ నెలలో 3.9శాతంగా ఉన్న కేసుల సంఖ్య మే నెలలో కేసుల సంఖ్య 14.31 శాతానికి పెరిగింది.

ఇకపోతే ఇప్పటివరకు రాష్ట్రంలో 57,054 కరోనా నిర్ధారిత పరీక్షలు చేయగా 7802 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత నెలలో అంటే మే నెలలో 21 రోజుల్లో 25,562 నిర్ధారిత పరీక్షలు చేయగా 5104 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంటే గడిచిన రెండు నెలలతో పోల్చుకుంటే పాజిటివ్ కేసుల శాతం 19.96 పెరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో అదికారులు నిర్వహిస్తున్న టెస్టుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలుతుందని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో లాక్ డౌన్ ఆంక్షలు సడలించడం, వలస కార్మికులు స్వస్థలాలకు తిరిగి రావడంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది.   

Tags:    

Similar News