వరంగల్‌లో 'టెలీమెడిసిన్‌' వైద్యసేవలు అందుబాటులోకి

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందున చాలా ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. ముఖ్యంగా అనారోగ్యంగా వారు ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది.

Update: 2020-04-08 13:34 GMT
Telemedical Services in Warangal

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందున చాలా ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. ముఖ్యంగా అనారోగ్యంగా వారు ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సాధారణ వైద్యసేవల కోసం ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండాలని వరంగల్ అర్భన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఓ ఆలోచన చేసారు. సాధారణం రోగులకు, క్యారంటైన్ లో ఉన్నవారికి ప్రాథమిక చికిత్స అదించేట్టుగా ఏర్పాట్లు చేసారు. కలెక్టర్ ఆదేశాల మేరకు టెలీ మెడిసిన్ ద్వారా వైద్య సేవలను ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలిత బుధవారం తన కార్యాలయంలో ఈ టెలిమెడిసిన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రతీ రోజు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల రోగులకు అందుబాటులో ఉంటుందని ఆమె తెలిపారు.

ఈ కేంద్రంలో జనరల్ ఫీజిషియన్ డాక్టర్‌, మానసిక వైద్యుడు అందుబాటులో ఉంటారని తెలిపారు. అనారోగ్య సమస్యతో బాధపడే వారు 7993969104, 7995118405, 93924693440 నంబర్లకు వాట్సాప్‌ లేదా వీడియో కాల్‌ చేసి ఆరోగ్య సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలు ఈ టెలిమెడిసిన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఫోన్‌ ద్వారా వైద్యులకు ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను తెలియజేస్తే మందులు, సలహాలను సూచిస్తారని పేర్కొన్నారు. కరోనా వైరస్ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరు తప్పకుండా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ఆమె కోరారు.

Tags:    

Similar News