తెలంగాణలో కరోనా వైరస్ పంజా విసురుతునేవుంది. కొత్తగా ఇవాళ 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ 19 కారణంగా మరో నలుగురు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 92కి చేరింది. ఇవాళ నమోదైన కేసులన్ని తెలంగాణలో పరిధిలోనివే కావడం గమనార్హం.
ఒక్క జీహెచ్ఎంసీలొనే 70 కేసులు వెలుగుచూశాయి. రాష్టంలో మొత్తం కేసుల సంఖ్య 2,891కి చేరింది. ఇప్పటి వరకు 1526 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 1273 మంది వివిధ ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు.