తెలంగాణలో కొత్తగా 253 కరోనా కేసులు.. 8 మరణాలు
తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.
తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ రోజు అధికంగా 253కేసులు నమోదయ్యాయి. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 179, మేడ్చల్‌లో 14, సంగారెడ్డిలో 24, రంగారెడ్డిలో 11, మహబూబ్ నగర్లో 4, వరంగల్ రూరల్ 2, వరంగల్ అర్బన్ 2, కరీంనగర్‌లో 2, నల్గొండ 2, ములుగు 2, సిరిసిల్ల 2, మంచిర్యాల 2, మెదక్ జిల్లాల్లో 1, సిద్దిపేట 1, ఖమ్మం 1, నిజామాబాద్ 1, జగిత్యాల 1, కామారెడ్డి 1, నగర్ కుర్నూర్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో 8 మంది కరోనాతో మృతి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 182 మంది మరణించారు. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,737కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,203 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అటు కరోనాతో పోరాడి ఇప్పటివరకు 2,352 మంది డిశ్చార్జ్ అయ్యారు.