తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న(మంగళవారం) ఒక్క రోజే 178 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు అధికంగా 191కేసులు నమోదయ్యాయి. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 143, మేడ్చల్‌లో 11, సంగారెడ్డిలో 11, రంగారెడ్డిలో 8, మహబూబ్ నగర్లో 4, జగిత్యాల 3, మెదక్ జిల్లాల్లో 3, నాగర్ కర్నూల్2, కరీంనగర్‌లో 2, నిజామాబాద్ 1, వికారాబాద్ 1, నల్గొండ 1, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో 8 మంది కరోనాతో మృతి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 156 మంది మరణించారు. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,111కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,138 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అటు కరోనాతో పోరాడి ఇప్పటివరకు 1,817 మంది డిశ్చార్జ్ అయ్యారు.
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 9,985 కేసులు నమోదు కాగా,279 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 2,76,583 కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,33,632 ఉండగా, 1,35,205 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 7,745 మంది కరోనా వ్యాధితో మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 50,61,332 కరోనా టెస్టులు. గడిచిన 24 గంటల్లో1,45,216టెస్టులు నిర్వహణ.