నా భర్తను నాకు అప్పగించాలి : బండి సంజయ్ తో వీడియో కాన్ఫరెన్స్ లో బాధితురాలు

తన భర్తను తనకు అప్పగించాలని కరోనా బాధితుని భార్య ఇటీవల కేటీఆర్ కు ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.

Update: 2020-05-24 07:51 GMT
Madhavi Video call with Bandi Sanjay

తన భర్తను తనకు అప్పగించాలని కరోనా బాధితుని భార్య ఇటీవల కేటీఆర్ కు ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే సదరు మహిళ తన భర్తను అప్పగించాలని మరో సారి డిమాండ్‌ చేశారు. ఇందులో భాగంగానే ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. గాంధీ వైద్యులు తన భర్త బతికే ఉన్నాడని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని చెప్పారని ఆమె అన్నారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ బాధితురాలికి తన భర్తను ప్రాణాలతో అప్పగిస్తే సీఎం కేసీఆర్‌ను సన్మానిస్తానని తెలిపారు. కరోనా బాధితుని విషయంలో ప్రభుత్వం చెప్పే మాటలకు, గాంధీ ఆస్పత్రి రికార్డులకు సరితూగడం లేదని ఆయన విమర్శించారు. మరణాలు పెరగాలని ఎవరు కోరుకోరని.. అతనికి ఏమయినా జరిగితే అది ప్రభుత్వ హత్యే అవుతుందన్నారు.

వనస్థలిపురంలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం కరోనా బారిన పడింది. దీంతో అధికారులు వారందరినీ గాందీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కుటుంబ సభ్యులందరూ కోలుకుని డిశ్చార్జి కాగా కుటుంబ యజమానికి కరోనా లక్షణాలు తగ్గకపోవడంతో అతన్ని ఆస్పత్రిలోనే ఉంచారు. ఆసుపత్రి సిబ్బందిని బాధితుని కుటుంబ సభ్యులు ప్రశ్నింగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. వారు స్పందించక పోవడంతో కరోనా చికిత్స కోసం వెళ్లిన తన భర్త జాడ తెలియడం లేదంటూ బాధితుని భార్య కేటీఆర్‌కు ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు. ఎలాగయినా ఈ విషయంలో తమకు సాయం చేయాలని ఆమె కోరారు. తాను, తన భర్త,ఇద్దరు కూతుళ్లతో కోవిడ్ ఆస్పత్రిలో చేరామని, తనతో పాటు కూతుళ్లు తిరిగివచ్చారని, తన భర్త మాత్రం కనిపించడం లేదని ఆమె కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.


Tags:    

Similar News