Corona: నిజామాబాద్ జిల్లాలో కరోనా విజృంభణ
Corona: ఒక్కరోజే మండలంలో 70 పాజిటివ్ కేసులు * కోవిడ్ కేసులు పెరగడంతో సెల్ఫ్ లాక్‌డౌన్
Representational Image
Corona: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 70మంది కరోనా బారిన పడ్డారు. దీంతో గ్రామపెద్దలు సమావేశమయ్యారు. ఇందులో భాగంగా గ్రామంలో సెల్ఫ్ లాక్‌డౌన్ నిబంధన అమల్లోకి తీసుకొచ్చారు. ఉదయం ఆరు గంటల నుండి 10 గంటల వరకే షాపులు తెరవాలని తీర్మానించారు. ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామన్నారు. ఇక అత్యవసర సమయంలోనే ఇంటి నుండి బయటకు రావాలంటూ ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలన్నారు.