పట్టణ ప్రగతిలో అపశ్రుతి.. గోడ కూలి చిన్నారి మృతి

వరంగల్ అర్భన్ జిల్లాలోని గోవిందరావుపేట మండల కేంద్రంలో ఓ దారుణమైన సంఘటన జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది.

Update: 2020-03-01 10:55 GMT

వరంగల్ అర్భన్ జిల్లాలోని గోవిందరావుపేట మండల కేంద్రంలో ఓ దారుణమైన సంఘటన జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మురుగు కాలువ పనులను నిర్వహిస్తుండగా గోడ కూలి ఓ చిన్నారి ప్రాణాలు కొల్పోయింది. స్థానికులు తెలిపిన వివరాల్లోకెళితే పట్టణంలోని 43వ డివిజన్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే పలు అభివృద్ది పనులను చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మురుగు కాలువను జేసీబీతో శుభ్రం చేస్తున్నారు. కాగా ఆ కాలువ పక్కనే ఒక గోడ ఉండగా జేసీబీ దానికి తగలడంతో ఆ గొడ ఆవరణలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై గోడ కూలింది. దీంతో ప్రిన్సి అనే ఎనిమిది సంవత్సరాల బాలిక మృతి చెందిగా, ఆమె తమ్ముడు తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఏజీఎం ఆస్పత్రికి తరలించారు. కగా ఈ ప్రమాదం జేసీబీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే జరిగిందని మృతురాలి తండ్రి, చిన్నారుల కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.

ఇక ఈ సంఘటన గురించి సమాచారం అందగా ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, జిల్లా కలెక్టర్‌ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితులను ఆదుకుంటామని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాని, ఈ సంఘటనపై విచారణ జరిపిస్తామని తెలిపారు. కాగా పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇంతటి అపశ్రుతి జరగడం బాధాకరమైన విషయమని అధికారులు తెలిపారు.

Full View

Tags:    

Similar News