Revanth Reddy: ఇవాళ ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు.
Revanth Reddy: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో వెయ్యి కోట్ల నిధులతో సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల దగ్గర బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. సభ ఏర్పాట్లను కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, ఓయూ ఉప కులపతి కుమార్ మొలుగరం, ఏసీపీ జగన్ , సీఐ అప్పలనాయుడు పరిశీలించారు. దాదాపు 5 వేలమంది కూర్చునేందుకు వీలుగా సభ ఏర్పాటు చేయనున్నారు.