Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా

Revanth Reddy: కేసీఆర్‌ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వివరాలు అందించాలని ఆదేశం

Update: 2023-12-08 06:32 GMT

Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా 

Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్‌ వైద్యంపై ఎప్పటికప్పుడు వివరాలు అందించాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి రేవంత్‌రెడ్డి సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ కేసీఆర్‌ ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్‌ సెక్రటరీకి వైద్యులు తెలిపారు. కేసీఆర్‌కు గాయం కావడంతో అధికారులు వెంటనే స్పందించి.. గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News