CM Revanth Reddy: అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఓ అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.
CM Revanth Reddy: అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఓ అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ రోడ్డులో కనిపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబీఆర్ పార్క్ రోడ్డు మీదుగా వెళ్తున్నారు. ఆ సమయంలో అంబులెన్స్ రావడంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ దారి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులపై అధికారులకు కీలక సూచనలు చేశారు. తాను వస్తున్నానని చెప్పి ప్రజలను గంటలకొద్దీ ఆపివేయవద్దని ట్రాఫిక్ అధికారులకు సూచించారు. తన రాకకు కొద్దిసేపు ముందు నిలిపివేస్తే చాలని చెప్పారు.