Revanth Reddy: రాష్ట్రానికి KCR చేసిన ద్రోహం ఏ నాయకుడు చేయలేదు

Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2025-12-22 05:40 GMT

Revanth Reddy: రాష్ట్రానికి KCR చేసిన ద్రోహం ఏ నాయకుడు చేయలేదు

Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు కేసీఆర్ చేసినంత ద్రోహం.. ఏ నాయకుడు చేయలేదన్నారు. చంద్రబాబుకు అసలైన శిష్యుడు కేసీఆర్ అని ఆరోపించారు. అల్లుడు, కొడుకు గొడవడుతూ ఉండటంతో కేసీఆర్ బయటకు వచ్చారని.. లేకపోతే ఫామ్ హౌస్ లోనే ఉండేవారన్నారు.

బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రమ్మంటే ముఖం చాటేస్తున్నారని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మాణం చేయవద్దన్న హర్షవర్ధన్ రెడ్డికి బీఫాం ఇచ్చారని గుర్తు చేశారు. పదేళ్ల పాలనలో కృష్ణ నదిపై ఒక్క ప్రాజెక్టు కట్టలేదని విమర్షించారు. కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయి కేసీఆర్ వేల కోట్ల కమీషన్లు దండుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Tags:    

Similar News