నేడు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
Delhi Tour: నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు.
నేడు ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
Delhi Tour: నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర అవిర్భావ ఉత్సవాలకు రావాల్సిందిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి స్వయంగా ఆహ్వానించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర అవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా జరిగే ఈ కార్యక్రమానికి సోనియాగాంధీని ఆహ్వానించడం ద్వారా ప్రజల్లోకి స్పష్టమైన సందేశం వెళ్లడంతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరుకావడం పీసీసీకి గౌరవంగా మారింది. జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు, ఆరోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని సోనియా గాంధీ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయం తీసుకుంటారా? లేక ఆమెకు బదులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పంపిస్తారా అన్న ఉత్కంఠ రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో నెలకొంది.