ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి.. ప్రధాని మోడీతో భేటీ

Delhi: మోడీతో భేటీ అనంతరం కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్న రేవంత్‌, భట్టి

Update: 2023-12-26 01:48 GMT

ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి.. ప్రధాని మోడీతో భేటీ  

Delhi:ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రధాని మోడీతో రేవంత్ భేటీ కానున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, విభజన హామీలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించనున్నారు. తెలంగాణ సీఎం హోదాలో తొలిసారి ప్రధాని మోడీతో రేవంత్ రెడ్డి భేటీ కానుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

మోడీతో భేటీ అనంతరం.. కాంగ్రెస్ పెద్దలతో కూడా సమావేశం కానున్నారు రేవంత్, భట్టి. పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నారు. తాజా రాజకీయాలు, నామినేటెడ్ పోస్టులపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించనున్నారు. ఎమ్మెల్సీ పదవులు, లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News