Hyderabad: పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన సీఎం కేసీఆర్..
Hyderabad: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో పర్యటించనున్నారు.
Hyderabad: పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన సీఎం కేసీఆర్..
Hyderabad: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు ముర్ము బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ముర్ముకు సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి కూడా స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో ముర్ము పర్యటించనున్నారు. ఈ రోజు రాత్రి రాజ్ భవన్‌లో ముర్ము బస చేస్తారు. రేపు ఉదయం 7 గంటలకు దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ కు రాష్ట్రపతి వెళ్తారు. ఎయిర్‌ఫోర్స్ పరేడ్ లో ముర్ము పాల్గొననున్నారు.