CM KCR to meet Governor Tamilisai: గవర్నర్‌ తో సమీక్ష జరపనున్న సీఎం కేసీఆర్..

CM KCR to meets Governor Tamilisai: మరికాసేపట్లోనే తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ తమిళి సైని కలిసి ఆమెతో భేటీ కానున్నారు. నగరంలోని పాత సచివాలయం కూల్చివేత, అలాగే రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితుల అంశాలపై గవర్నర్ తమిళి సైతో సీఎం కేసీఆర్ చర్చించనున్నట్టు తెలుస్తోంది

Update: 2020-07-20 10:51 GMT
CM KCR to meet Governor Tamilisai to discuss on covid19 and new secretariat construction

CM KCR to meets Governor Tamilisai: మరికాసేపట్లోనే తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ తమిళి సైని కలిసి ఆమెతో భేటీ కానున్నారు. నగరంలోని పాత సచివాలయం కూల్చివేత, అలాగే రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితుల అంశాలపై గవర్నర్ తమిళి సైతో సీఎం కేసీఆర్ చర్చించనున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైకు ఈ రెండు అంశాలపై వివరణ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే సచివాలయ కూల్చివేతను సుమారుగా పూర్తి చేసిన ప్రభుత్వం త్వరలోనే కొత్త సచివాలయ నిర్మాణంపై కేబినెట్‌లో తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. సీఎం కేసీఆర్ గవర్నర్‌ను కలిసి అంతకుముందే ఈ అంశంపై చర్చించనున్నారని తెలుస్తోంది. అంతే కాక తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసులు, కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు, ప్రభుత్వం నిర్వహిస్తున్న కరోనా టెస్టులపై సీఎం కేసీఆర్ గవర్నర్‌కు వివరాలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఇప్పటి వరకు గవర్నర్, సీఎంలు సమీక్షలు నిర్వహించకపోవడంతో గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య గ్యాప్ పెరిగిపోయిందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం గవర్నర్ తమిళిసై నిర్వహించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కరోనా సమీక్షకు దూరంగా ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైను కలవనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ చర్చలు ముగిసిన అనంతరం గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉన్న జీవగడ్డ తెలంగాణ కాబట్టి, ఈ ప్రాంతానికి పుష్కలమైన నీటి వసతి కల్పించే దిశగా రాష్ర్టంలో రెండు కీల‌క‌మైన ఇంజినీరింగ్ విభాగాల ముఖ్యుల‌తో సీఎం విస్ర్త‌త‌స్థాయి స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. ఈ రోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి నీటి పారుద‌ల‌శాఖ‌పై అదేవిధంగా రేపు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఆర్అండ్‌బీశాఖ‌పై స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

Tags:    

Similar News