Tamilisai Soundararajan Launched Plasma Bank: ఈఎస్‌ఐలో ప్లాస్మా బ్యాంకును ప్రారంభించిన గవర్నర్

Tamilisai Soundararajan Launched Plasma Bank: ఈఎస్‌ఐలో ప్లాస్మా బ్యాంకును ప్రారంభించిన గవర్నర్
x
Governor Tamilisai Soundararajan Launched Plasma Bank
Highlights

Tamilisai Soundararajan Launched Plasma Bank: తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా లేని రాష్ట్రంగా చూడటమే తన లక్ష్యమని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.

Tamilisai Soundararajan Launched Plasma Bank: తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా లేని రాష్ట్రంగా చూడటమే తన లక్ష్యమని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. సనత్‌నగర్‌ ఈఎస్‌ ఐ మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్లాస్మా బ్యాంకును ఆమె శనివారం ప్రారంభించారు. అంనంతరం గాంధీలో తొలిసారిగా ప్లాస్మాను దానం చేసిన దాత సంతోష్‌గౌడ్‌ను అభినందించారు. ఆ తరువాత ఈఎస్‌ఐ ఆస్పత్రి వార్డులలో తిరిగి రోగులను పలకరించారు. ఆస్పత్రిలో వైద్యులు అందించే సేవల గురించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు ప్లాస్మా దానం చేస్తే మరో ఇద్దరు వ్యక్తులను బతికించొచ్చని తెలిపారు.

పాస్ల్మా దానం చేయడం వల్ల ఎటువంటి భయం అవసరం లేదని పేర్కొన్నారు. కరోనా చికిత్స విధానంలో ప్లాస్మా థెరపీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. వైరస్‌ నుండి కోలుకున్న వారు తమ ప్లాస్మా ను ఇతర రోగులకు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన బాధితులకు చికిత్స అందించేందుకు వీలుగా రూపొందించిన అత్యాధునిక పీఏపీఆర్‌ కిట్‌ను ఆసుపత్రిలో ప్రదర్శించారు. ఈఎస్‌ఐ ఆసుపత్రిలో కరోనా రోగులకు అందుతున్న సేవలపై గవర్నర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. వైరస్‌ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్య కళాశాల డీన్‌తో పాటు ఈఎస్‌ఐసీ రిజిస్ట్రార్‌ తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories