CM KCR: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత

CM KCR: వారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం

Update: 2023-09-27 02:02 GMT

CM KCR: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత వారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. వారం రోజులుగా సీఎం కేసీఆర్ దగ్గు, జ్వరంతో బాదపడుతున్నారని.. ప్రస్తుతం ఆయనకు ప్రగతిభవన్‌లోనే చికిత్స జరుగుతుందన్నారు కేటీఆర్. త్వరలోనే కేసీఆర్ సాధారణ స్థితికి వస్తారని వైద్యులు చెప్పినట్లు తెలిపారు.


Tags:    

Similar News