రైతులుపై దళారుల దాడి...పండ్ల మార్కెట్ లో ఉద్రిక్తత
హైదరాబాద్ కొత్తపేట పండ్ల మార్కెట్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బొప్పాయి పండ్ల అమ్మకాల విషయంలో రైతులకు, దళారులకు మధ్య గొడవ జరిగింది. బొప్పాయి పండ్లను దళారులకు ఇవ్వకుండా రైతులు నేరుగా అమ్మకాలు జరుపుతున్నారు. అమ్మకాలు అడ్డుకున్న దళారులు రైతులపై దాడి చేశారు.
హైదరాబాద్ కొత్తపేట పండ్ల మార్కెట్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బొప్పాయి పండ్ల అమ్మకాల విషయంలో రైతులకు, దళారులకు మధ్య గొడవ జరిగింది. బొప్పాయి పండ్లను దళారులకు ఇవ్వకుండా రైతులు నేరుగా అమ్మకాలు జరుపుతున్నారు. అమ్మకాలు అడ్డుకున్న దళారులు రైతులపై దాడి చేశారు. రైతులతో దళారులు బొప్పాయి పండ్లు తమకే అమ్మాలని బెదిరింపులకు దిగారు. దళారులు బెదిరించినప్పటికీ రైతులు తలొగ్గకుండా వారిపై దాడికి దిగారు. డెంగ్యూ, ఇతర వ్యాధుల భారీన పడుతున్న వారు బొప్పాయి పండ్లు తింటే ప్లేట్ లెట్స్ ఎక్కువుతాయని ప్రచారం జరుగుతుండటంతో బొప్పాయి అమ్మకాలు పెరిగాయి. మార్కెట్లో పండ్ల వ్యాపారులు బొప్పాయి రేటును అమాంతం పెంచారు. మార్కెట్లో బొప్పాయి పండ్ల ధరలు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. కేజీ బొప్పాయి 100 రూపాయల వరకు ధర పలుకుతోంది. కొత్తపేట ప్రూట్ మార్కెట్ కు బొప్పాయి పండ్లు తీసుకు వచ్చిన రైతులకు తక్కువ ధర ఇస్తున్నారు. అయినా తమకు తక్కువ ధర చెల్లిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ..మార్కెట్లో నేరుగా అమ్ముకోవడం మొదలు పెట్టారు.
మార్కెట్ కు పండ్లు తీసుకు వచ్చిన రైతులు నేరుగా అమ్ముకోవద్దంటూ దళారులు రైతులతో గొడవకు దిగారు. తాము అడిగిన ధరకే బొప్పాయి పండ్లు ఇవ్వాలంటూ రైతులపై వత్తిడి చేశారు. ఇందుకు వ్యతిరేకించడంతో రైతులపై దళారులు దాడికి తెగించారు. మార్కెట్ కు వచ్చిన రైతులంతా ఏకమయ్యారు. మద్యదళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాము పండించిన పంటకు సరైన ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
దళారుల దాడిలో నలుగురు రైతులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసారు. గిట్టుబాటు ధర చెల్లించకుండా తక్కువ ధరలకే కొనుగోలు చేస్తున్న దళారులపై అధికారులు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.