ఆయన దేశ రాజకీయాల్లో ప్రభావం చూపిన ప్రజ్ఞాశాలి : చిరంజీవి

Update: 2019-07-28 10:22 GMT

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి మృతి పట్ల ప్రముఖ సినీ నటుడు చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దేశ రాజకీయాల్లో జైపాల్‌రెడ్డి తనదైన ముద్రవేశారని, ఆయన మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు అని చిరంజీవి అన్నారు. రాజకీయ దురంధురుడు , మేధావి , జ్ఞాని అయిన జయపాల్ రెడ్డి గారి మరణం నన్ను దిగ్బ్రాంతికి గురిచేసింది. దేశ రాజకీయాల్లో అయన ప్రభావం చూపిన ప్రజ్ఞాశాలి . అయన వాగ్ధాటి , రాజకీయ పరిజ్ఞానం నన్ను అయన పట్ల గౌరవాన్ని పెంచింది , అభిమానపాత్రుడ్ని చేసింది . ఆయన మరణం కాంగ్రెస్ కి తీరని లోటు . అయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని సానుభూతి తెలిపారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఆకస్మిక మృతిని... కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. జైపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి... పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు.జైపాల్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు జూబ్లిహిల్స్‌లోని జైపాల్‌రెడ్డి స్వగృహం నుంచి ఆయన అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సందర్శకుల దర్శనార్థం గాంధీభవన్‌లో మాధ్యాహ్నం రెండు గంటల వరకు పార్థీవదేహాన్ని అక్కడే ఉంచుతారు. పీవీ ఘాట్‌ పక్కన అంత్యక్రియలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే జైపాల్ రెడ్డికి స్మారక చిహ్నం కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. 

Tags:    

Similar News