Sai Dharam Tej: అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్‌ తేజ్‌

Sai Dharam Tej: వెంటిలేటర్‌పై కొనసాగుతున్న చికిత్స

Update: 2021-09-12 04:47 GMT
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ (ఫైల్ ఇమేజ్)

Sai Dharam Tej: కేబుల్‌ బ్రిడ్జి దగ్గర బైక్‌ స్కిడ్‌ అయిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌కు అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. తేజ్‌.. చికిత్సకు స్పందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మొన్నటితో పోల్చితే నిన్న ఆయన ఆరోగ్యం.. మరింత మెరుగుపడిందని వెల్లడించారు. ఇక.. నిన్న స్పృహలోకి వచ్చిన తేజ్.. కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో ఒక నిమిషం పాటు మాట్లాడారు. తనకు నొప్పిగా ఉందని చెప్పాడు.

ఇక.. ఇవాళ తేజ్‌కు అపోలో వైద్యులు కాలర్‌ బోన్‌ సర్జరీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. తేజ్‌కు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అవయవాలన్నీ సరిగ్గానే ఉన్నాయని తెలిపారు. న్యూరో సర్జన్‌ అలోక్‌ రంజన్, ఆర్థోపెటిక్‌ బాలా వర్ధన్‌ నేతృత్వంలో 36 గంటల పర్యవేక్షణ పూర్తికాగా.. ప్రస్తుతం తేజ్‌ కు వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగుతోంది. ప్రతి 9 గంటలకు ఒకసారి MRI సిటీ స్కాన్‌ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం వెంటిలేటర్‌ తొలగించి.. నార్మల్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇవాళ మరోసారి సాయిధరమ్‌ తేజ్‌ హెల్త్ బులెటిన్‌ విడుదల చేయనున్నారు అపోలో వైద్యులు.

Tags:    

Similar News