BJP: ఇవాళ బీజేపీ ఎంపీ రెండో జాబితాకు ఛాన్స్‌..!

BJP: తెలంగాణ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ నేతలతో.. చర్చించిన హోంమంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డా

Update: 2024-03-10 03:23 GMT

BJP: ఇవాళ బీజేపీ ఎంపీ రెండో జాబితాకు ఛాన్స్‌..!

BJP: తెలంగాణలో పాటు మిగితా రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది. నిన్న అర్ధరాత్రి వరకూ కోర్‌ గ్రూప్ నాయకులతో జేపీ నడ్డా, అమిత్‌ షా విస్తృతంగా చర్చించారు. మిగితా స్థానాలకు అభ్యర్ధుల ఎంపికపై ఇవాళ జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఆమోదముద్ర పడుతుందని...పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ..మిగిలిన 8 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. ఈ విషయంపై చర్చించేందుకు..హైకమాండ్ నుండి పిలుపు రావడంతో బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కిషన్‌రెడ్డి..ఢిల్లీ వెళ్లి అమిత్‌ షా...నడ్డాలతో భేటీ అయ్యారు.

Tags:    

Similar News