క‌రోనా కట్టడిలో సీఎం కేసీఆర్ కృషి ప్రశంసనీయం

కరోనా వైరస్ నీ కట్టడి చేయడానికి సీఎం కేసిఆర్ ఎన్నో కఠినమైన చర్యలను తీసుకున్నారని, కంటికి కనిపించని వైరస్ ను ఎదుర్కోవ‌డానికి ఆయన రాష్ట్ర ఖ‌జానాని కూడా లెక్క చేయ‌క‌ ప్రజల ప్రాణాలే ముఖ్యమ‌ని అనేక సాహ‌సోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

Update: 2020-06-03 13:40 GMT

యాదాద్రి జిల్లాలోని చందుపట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మందడి లక్ష్మీనరసింహా రెడ్డి కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేస్తున్నకృషికి త‌న వంతు బాధ్యతగా రూ.2 ల‌క్షల విరాళం ప్రకటించారు.

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో మంత్రి ఎర్రబెల్లికి ఇచ్చిన విరాళం చెక్కుని హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ కు అందజేశారు. దీంతో లక్ష్మీనరసింహా రెడ్డిని మంత్రులు అభినందించారు. 

Tags:    

Similar News