సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమామహేశ్వరరావు అరెస్ట్
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
ACP Umamaheswara Rao: సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమామహేశ్వరరావును ఏసీబీ అరెస్ట్ చేసింది. కాసేపట్లో ఉమామహేశ్వరరావును ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు అధికారులు. నిన్న 14 గంటల పాటు ఉమామహేశ్వరరావుతో పాటు.. ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో 14 చోట్ల సోదాలు చేసిన ఏసీబీ అధికారులు.. 17 ప్రాంతాల్లో ఆస్తులను గుర్తించారు. పలు కీలక డాక్యుమెంట్లతో పాటు.. 38 లక్షల నగదు, 60 తులాల బంగారం, వెండి సీజ్ చేశారు.