Obulapuram Mining Case: 14 ఏళ్ల తర్వాత తీర్పు.. గాలిజనార్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలపై కీలక తీర్పు

Obulapuram Mining Case: ఓబుళాపురం మైనింగ్ కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది.

Update: 2025-05-06 06:21 GMT

Obulapuram Mining Case: ఓఎంసీ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు సంచలన తీర్పు..గాలి జనార్ధన్ రెడ్డి సహా ఐదుగురికి శిక్ష ఖరారు

Obulapuram Mining Case: ఓబుళాపురం మైనింగ్ కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. 884 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని గాలిజనార్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మరికొందరిపై సీబీఐ అభియోగాలు దాఖలు చేసింది. మొత్తం ఏడుగురికి నేడు సీబీఐ కోర్ట్ తీర్పు వెల్లడించనుంది. కాగా 14 ఏళ్ళ తర్వాత సుదీర్ఘ విచారణ తర్వాత నేడు తీర్పు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.

కర్ణాటక-ఆంధ్ర సరిహద్దులోని అనంతపురం జిల్లా ఓబుళాపురంలో మైనింగ్స్ కేటాయింపు, టెండర్ల విషయంలో దాదాపు 884 కోట్ల రూపాయాలు దుర్వినియోగానికి గురైనట్టు గుర్తించిన సీబీఐ 2009లో కేసు నమోదు చేసింది. 2011 తొలిఛార్జ్‌ షీట్ నమోదు చేసింది. ఆ ఛార్జ్‌షీట్‌లో వీడి రాజగోపాల్, కృపానందం, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, గాలిజనార్ధన్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, IAS శ్రీలక్ష్మి పేర్లు చేర్చారు. మొత్తం 4 అభియోగపత్రాల్లో 9 మందిని నిందితులుగా చేర్చింది సీబీఐ కాగా వీరిలో IAS శ్రీలక్ష్మిపై నమోదైన అభియోగాలను 2022లోనే సుప్రీంకోర్ట్ కొట్టేసింది. మరొకరు మృతి చెందగా మిగిలిన ఏడుగురుపై నేడు తీర్పు వెలువడనుంది.

Tags:    

Similar News