Pragathi Bhavan: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
RS Parliamentary Party Meeting: బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది.
Pragathi Bhavan: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
BRS Parliamentary Party Meeting: బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో బీఆర్ఎస్ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, కేంద్రం తెచ్చే బిల్లులు తదితర అంశాలపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు, లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్‌రావు సహా ఎంపీలందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.