BRS MLA Maganti Gopinath: తీవ్ర అస్వస్థత.. ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు కిడ్నీ సమస్యలతో తీవ్ర అస్వస్థత.. ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స
BRS MLA Maganti Gopinath: తీవ్ర అస్వస్థత.. ఏఐజీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స
BRS MLA Maganti Gopinath: జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూత్రపిండాల వైఫల్యం (Kidney Failure) వల్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆయనను వెంటిలేటర్‌కు మార్చినట్టు సమాచారం.
గత నాలుగు నెలలుగా ఆయన ఇంటి వద్ద చికిత్స పొందుతున్న గోపీనాథ్ ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో అత్యున్నత వైద్యం అందిస్తున్నారు. ముఖ్యమైన అవయవాల పనితీరును నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాగంటి గోపీనాథ్, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆయన నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
ప్రజల ప్రార్థనలు, పార్టీ శ్రేణుల్లో ఆందోళన
గోపీనాథ్ ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు, పార్టీ నేతలు కుటుంబ సభ్యులను సంప్రదించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఈ సంక్లిష్ట సమయంలో గోపీనాథ్ కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్నారు.