Harish Rao: ఉన్న పథకాలు బంద్ పెట్టడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు
Harish Rao: ఉన్న పథకాలను బంద్ పెట్టడమే కాంగ్రెస్ తీసుకొచ్చిన మార్పు అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఫైరయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు.
Harish Rao: ఉన్న పథకాలు బంద్ పెట్టడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు
Harish Rao: ఉన్న పథకాలను బంద్ పెట్టడమే కాంగ్రెస్ తీసుకొచ్చిన మార్పు అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఫైరయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒక చీర కాదు.. రెండు చీరలు అని... దసరా పండగకు అక్కాచెల్లెమ్మలను ప్రభుత్వం నిరుత్సాహపరిచిందన్నారు. రైతుబంధు 15 వేలు ఇస్తామని ఇప్పటివరకు రూపాయి ఇచ్చింది లేదని విమర్శించారు.
ముదిరాజ్, గంగపుత్రులంటే రేవంత్ రెడ్డికి చిన్నచూపు అన్న హరీష్ రావు.. అక్టోబర్ వచ్చినా చెరువుల్లో చేపపిల్లలను వేయలేదన్నారు. తమ ప్రభుత్వం చేపపిల్లల కోసం వంద కోట్లు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లల కోసం బడ్జెట్‌లో 16కోట్లు మాత్రమే కేటాయించిందని మండిపడ్డారు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని పేద గర్భిణీ స్త్రీలను మోసం చేశారని ఆరోపించారు హరీష్ రావు.