బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం.. శాసనసభ పక్ష నేతగా కేసీఆర్
BRS LP Meeting: రాష్ట్రవ్యాప్తంగా 39మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేల ఎన్నిక
బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం.. శాసనసభ పక్ష నేతగా కేసీఆర్
BRS LP Meeting: తెలంగాణ అసెంబ్లీ కొలువు దీరనుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో ఎల్పీ నేత ఎవరు అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను కాసేపట్లో ఎన్నుకోనున్నట్లు తెలిసింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌లో సమావేశమై ఈ మేరకు తీర్మానం చేస్తారని తెలుస్తోంది
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో గెలుపొంది ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. కేసీఆర్ కాలుకు యశోద ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదు. మిగిలిన 38 మంది ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై కేసీఆర్‌ను ఎల్పీ నేతగా ఎన్నుకుంటారని తెలుస్తోంది. ఈమేరకు తీర్మానం ప్రవేశపెట్టి... ఆ తీర్మానాన్ని ఆమోదిస్తారని తెలుస్తోంది.