Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు షెడ్యూల్ రావడంతో దూకుడు పెంచిన కారుపార్టీ ఇవాళ కేటీఆర్ నేతృత్వంలో సన్నాహక సమావేశాలు
Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు
జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటును ఎలాగైనా నిలుపుకోవాలన్న పట్టుదలతో కారు పార్టీ టాప్‌గేర్‌లో దూసుకెళ్తోంది. ఉప ఎన్నికలో గెలుపు కోసం వ్యూహాలకు పదునుపెడుతూ ముందుకు సాగుతోంది. నోటిఫికేషన్ కంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్.. షెడ్యూల్ రావడంతో మరింత దూకుడు పెంచింది. ప్రచారాన్ని కూడా పరుగులు పెట్టించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, గ్రేటర్ హైదరాబాద్‌లోని పార్టీ కార్పోరేటర్లతో వేర్వేరుగా సమావేశాలు జరపనున్నారు.
ఎన్నికల ప్రచారం, రోడ్ షోలు, ర్యాలీలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు కేటీఆర్. ఇప్పటికే హరీష్ రావు, తలసాని సహా.. సీనియర్ నేతలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమాలోచనలు చేసిన కేటీఆర్, కాంగ్రెస్ బీజేపీలకు అవకాశం ఇవ్వకుండా ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.