BRS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కు బీఆర్ఎస్ సర్వంసిద్ధం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కు బీఆర్ఎస్ సర్వంసిద్ధం BRS స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల 40 మంది ముఖ్య నేతలకు ఈసీ అనుమతి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అనుమతి వీరు ప్రచారానికి పూర్తి స్థాయిలో తిరగవచ్చన్న ఈసీ
BRS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కు బీఆర్ఎస్ సర్వంసిద్ధం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం కోసం భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆమోదం తెలిపింది. BRS జనరల్ సెక్రెటరీ శ్రీ సోమ భరత్ కుమార్ ఇచ్చిన ప్రతిపాదన మేరకు, వీరికి వాహన అనుమతి పాస్‌లను మంజూరు చేశారు. నవంబర్ 09 తేదీ సాయంత్రం 06.00 గంటల వరకు ఈ ప్రచారాన్ని నిర్వహించుకోవచ్చని ఈసీ తెలిపింది.
పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనే 40 మంది ప్రముఖులలో మాజీ ముఖ్యమంత్రి మరియు ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మాజీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలైన కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి ఉన్నారు. ఇతర మాజీ మంత్రులలో మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ తదితరులు ఉన్నారు. అలాగే మాజీ ఉప సభాపతులు టి. పద్మారావు గౌడ్, శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి తో పాటు.. ఎమ్మెల్యేలైన ఎం. కృష్ణారావు, కె.పి. వివేకానంద గౌడ్, డి. సుధీర్ రెడ్డి, డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేశం, పాడి కౌశిక్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, కల్వకుంట్ల సంజయ్, అనిల్ జాదవ్, బండారు లక్ష్మా రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, చింతా ప్రభాకర్ కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. వీరు కాకుండా ఎమ్మెల్సీలలో దాసోజు శ్రవణ్, ముఠా గోపాల్, శంబిపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు కూడా ఉండడం విశేషం.