Hyderabad: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తి.. భార్యే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడి

Hyderabad: ఈ నెల 12న బోడుప్పల్‌లోని ఓ ప్లే స్కూల్లో అశోక్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందారు.

Update: 2025-12-22 07:06 GMT

Hyderabad: ఈ నెల 12న బోడుప్పల్‌లోని ఓ ప్లే స్కూల్లో అశోక్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని బృందావన్ కాలనీలో ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అశోక్ మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని భార్య పూర్ణిమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పూర్ణిమపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పూర్ణిమను అదుపులోకి తీసుకుని విచారించగా తానే అశోక్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్ణిమపై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News