ఇవాళ నాగర్‌కర్నూల్‌లో బీజేపీ నవ సంకల్ప సభ.. హాజరుకానున్న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

Nagarkurnool: మోడీ 9 ఏళ్ల విజయాలను వివరించనున్న నడ్డా

Update: 2023-06-25 05:12 GMT

ఇవాళ నాగర్‌కర్నూల్‌లో బీజేపీ నవ సంకల్ప సభ.. హాజరుకానున్న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

Nagarkurnool: ఇవాళ నాగర్‌కర్నూల్‌లో బీజేపీ నవ సంకల్ప సభ నిర్వహించనుంది. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరుకానున్నారు. మోడీ9 ఏళ్ల విజయాలను నడ్డా సభలో ప్రజలకు వివరించనున్నారు. సంపర్క్ సే సమర్ధన్‌లో భాగంగా ఇద్దరు ప్రముఖులను నడ్డా కలవనున్నారు. మోడీ తొమ్మిదేళ్ల పాలన వివరాలు ఉన్న పుస్తకాలను అందజేయనున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహరచన చేస్తోంది.

కర్ణాటకలో ఓటమి తర్వాత తెలంగాణలో కేడర్ నిరుత్సాహ పడకుండా వరుస సభలు సమవేశాలకు ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో విజయంతో సౌత్‌లో ఖాతా తెరవాలని భావిస్తున్న బీజేపీ అధినాయకత్వం అందుకు తగ్గట్లుగా అడుగులు వేస్తోంది. ఇంటింటికి బీజేపీతో పాటు జాతీయ నాయకులతో వరుస సభలు, సమావేశాలకు ప్లాన్ చేస్తోంది.

Tags:    

Similar News