అసెంబ్లీలో రాజాసింగ్ వీరంగం

Update: 2020-03-16 09:29 GMT

అసెంబ్లీలో సీఏఏపై జరిగిన చర్చలో గందరగోళం నెలకొంది. ప్రజలను ప్రభుత్వం ఢోకా చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ అతను వాడిన భాషని రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. రాజాసింగ్ మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో రాజాసింగ్ వెల్‌లోకి తీసుకెళ్లి తీర్మాన ప్రతులను చించివేశారు. సీసీఏపై చర్చలో అందరికి అవకాశం ఇచ్చామని అందరి అభిప్రాయాలు స్వీకరించామని సీఎం తెలిపారు. తర్వాత సీసీఏను వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. అయితే బీజేపీ అభిప్రాయం తీసుకోకుండా బిల్‌ను తీర్మానం చేశారని రాజాసింగ్ ఆరోపించారు. 

Tags:    

Similar News