Raja Singh: దమ్ముంటే అడ్డుకోండి.. పోలీసులకు రాజాసింగ్ సవాల్..
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.
Raja Singh: దమ్ముంటే అడ్డుకోండి.. పోలీసులకు రాజాసింగ్ సవాల్..
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బక్రీద్ సమయంలో గోరక్షణకు హిందువులు వెళ్లొద్దని పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గోరక్షణ చేస్తే కేసులు పెడుతామని బెదిరిస్తున్నారని.. పోలీసుల బెదిరింపులకు తాము భయపడమని అన్నారు. చట్ట వ్యతిరేకంగా గోవులను తరలిస్తే శిక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే, పోలీసులు వారికి కొమ్ము కాస్తున్నారన్నారు రాజాసింగ్. గోవులను కాపాడేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతానని.. దమ్ముంటే తనపై కేసులు నమోదు చేసుకోండని సవాల్ చేశారు.