సీఏం కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే : లక్ష్మణ్

Update: 2019-11-06 10:35 GMT

ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చలేని ముఖ్యమంత్రి తన ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి డెడ్ లైన్ ను కార్మికులు పట్టించుకోకపోవడం తో తెలంగాణలో పాలన సంక్షోభంలో పడినట్లేనన్నారు. ఆర్టీసీ సమ్మెపై భవిష్యత్ కార్యాచరణకు మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్ లతో కమిటీ వేసినట్లు లక్ష్మణ్ తెలిపారు. ఈనెల 9న ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన మిలియన్ మార్చ్ పిలుపుకు బీజేపీ మద్దతు పలుకుతోందన్నారు. సమస్య పరిష్కారానికి ప్రయత్నించకుండా నానబెట్టి సమస్యలు సృష్టిస్తున్నారని కేసీఆర్ పై లక్ష్మణ్ విరుచుకుపడ్డారు.

Tags:    

Similar News