హైదరాబాద్‌లో బిహార్‌ క్యాంప్‌ రాజకీయం.. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ యత్నం

Hyderabad: హైదరాబాద్‌కు 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తరలింపు

Update: 2024-02-05 03:45 GMT

హైదరాబాద్‌లో బిహార్‌ క్యాంప్‌ రాజకీయం.. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ యత్నం

Hyderabad: హైదరాబాద్‌ మరో రా‍ష్ట్ర క్యాంపు రాజకీయాలకు వేదికయ్యింది. తాజాగా బిహార్‌ క్యాంపు రాజకీయం తెలంగాణలోని హైదరాబాద్‌కు చేరుకుంది. బిహార్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లోని ఇబ్రహింపట్నం పార్క్‌ అవెన్యూ రిసార్ట్స్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ క్యాంపును ఏర్పాటు చేసింది. ఈ క్యాంపు బాధ్యతలను ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి తెలంగాణ పీసీసీ అప్పగించింది.

ఇటీవల బిహార్ సీఎం నితీష్ కుమార్ మహాఘట్ బంధన్‌ కూటమి నుంచి వైదొలగడంతో బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పిన నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో ఎన్డీయే కూటమిలో చేరి... నితీష్ కుమార్ బిహార్‌లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బిహార్‌కు 9వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్‌ ప్రభుత్వం.. ఈ నెల 12న అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎటువంటి ప్రలోభాలకు గురి కావొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ అలర్టై ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించింది.

Tags:    

Similar News