Double Bedroom Scam: డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో మోసం.. 2.5 కోట్లు దోచేసిన BHEL ఉద్యోగి

Double Bedroom Scam: సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో డబుల్‌ బెడ్ రూం ఇండ్లపేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

Update: 2025-11-24 10:28 GMT

Double Bedroom Scam: డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో మోసం.. 2.5 కోట్లు దోచేసిన BHEL ఉద్యోగి

Double Bedroom Scam: సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో డబుల్‌ బెడ్ రూం ఇండ్లపేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయలు BHEL ఉద్యోగి ప్రసన్న కుమార్ వసూలు చేశాడని ఆరోపణలు వినిపించాయి. జోష్ బ్రదర్ అనే మధ్యవర్తి‌ ద్వారా బాధితులకు ప్రసన్న కుమార్ పరిచయమైయ్యాడిని.. మొత్తం 69 మంది నుంచి 2 కోట్ల 50 లక్షల రూపాయల వసూలు చేశాడని బాధితులు చెప్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ గురించి అడిగితే నేడు, రేపు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్తున్నట్లు తెలిపారు. దీంతో అమీన్ పూర్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News