Bhatti Vikramarka: కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలిగేదే చెబుతుంది..ఎవరిని మోసం చేయాలనే ఆలోచన మాకు లేదు
Bhatti Vikramarka: ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం
Bhatti Vikramarka: కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలిగేదే చెబుతుంది..ఎవరిని మోసం చేయాలనే ఆలోచన మాకు లేదు
Bhatti Vikramarka: రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వంలో మంత్రులుగా కంకణ బద్ధులై పనిచేస్తున్నామన్నారు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం సీతారాంపురం సభలో పాల్గొన్న ఆయన ఉద్యోగులనుగత ప్రభుత్వం ఇబ్బందుకు గురిచేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారిని తిరిగి అదుకుంటుందన్నారు. మహిళలను ఆర్దికంగా నిలబెట్టేందుకు రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలను అందజేస్తామన్నారు. నిరుద్యోగులు గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. 2.75 కోట్ల బడ్జెట్ రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించాలనే ఉదేశ్యంతో ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది రోజుల్లోనే లో 25వేల ఉద్యోగులు బర్తీచేసి గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా విడుదల చేసామన్నారు