Bhatti Vikramarka: అట్టహాసంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు
Bhatti Vikramarka: పాదయాత్ర క్యాంప్‌లో కేక్ కట్ చేయించిన అభిమానులు
Bhatti Vikramarka: అట్టహాసంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు
Bhatti Vikramarka: పీపుల్స్ మార్చ్ పాదయాత్ర క్యాంప్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పుట్టిన రోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాత్రి 12 దాటగానే బాణా సంచా కాల్చి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాక రంగారెడ్డి జిల్లా డీసీపీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ప్రత్యేకంగా భట్టి విక్రమార్క ఫొటోతో చేయించిన కేక్ ను తీసుకువచ్చారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా చెన్నారం గ్రామంలో బస చేస్తున్న శిబిరం వద్దకు భట్టి కుటుంబ సభ్యులు వచ్చి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.