Bhatti Vikramarka: పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారు

Bhatti Vikramarka: ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారు

Update: 2023-04-20 15:00 GMT

Bhatti Vikramarka: పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారు

Bhatti Vikramarka: BRS అధికారంలోకి వచ్చాక పేద విద్యార్థులను నాణ్యమైన విద్యకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రైవేటు విద్యాసంస్థలు ఏర్పాటు చేసి ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లాలో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా.. విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ హయంలో పేద విద్యార్ధులందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో.. ఫీజు రియంబర్స్‌మెంట్ తీసుకొచ్చామన్నారు. అయితే.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాకా.. మెల్లమెల్లగా ఫీజు రియంబర్స్‌మెంట్ ఇవ్వకుండా స్టూడెంట్స్‌ను విద్యకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు భట్టి.  

Tags:    

Similar News