Ganesh Utsav Committee: హుస్సేన్ సాగర్‌లోనే వినాయక నిమజ్జనాలు చేస్తాం..
Ganesh Nimajjanam: ఈ సారి కూడా వినాయక విగ్రహాలను హుస్సెన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేసి తీరుతామని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి స్పష్టం చేసింది.
Ganesh Utsav Committee: హుస్సేన్ సాగర్‌లోనే వినాయక నిమజ్జనాలు చేస్తాం..
Ganesh Nimajjanam: ఈ సారి కూడా వినాయక విగ్రహాలను హుస్సెన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేసి తీరుతామని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి స్పష్టం చేసింది. విగ్రహాల ఎత్తు విషయంలో పోలీసులు, ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని ఉత్సవ కమిటీ కార్యదర్శి భగవంతరావు తేల్చిచెప్పారు. విగ్రహాల తయారీ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న ఉత్సవ కమిటీ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతీ మండపంలో జాతీయ జెండాలను ఉంచాలని సంప్రదాయబద్దంగా వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.