జనవరిలో 9రోజులు బ్యాంకులకు సెలవు

Update: 2019-12-31 08:37 GMT
ప్రతీకాత్మక చిత్రం

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని బ్యాంకులకు జనవరి నెలలో ప్రభుత్వం తొమ్మిది రోజులు సెలవులు ప్రకటించింది. ఆదివారం, రెండు శనివారాలు కలుపుకుని న్యూ ఇయర్ డే, భోగి, మకర సంక్రాంతి, రిపబ్లిక్ డేలకు సెలవులు ప్రకటించింది. కాని ఈ సారి రిపబ్లిక్ డే ఆదివారం రావడంతో పబ్లిక్ హాలిడే ఒక రోజు తగ్గిందనే చెప్పుకోవాలి. ఇక బ్యాంక్ ఖాతాదారులు బ్యాంక్ సెలవు దినాలను చూసుకుని బ్యాంకు సంబంధిత పనులను ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఇక ఈ సెలవు తేదీలు రాష్ట్రాల వారీగా కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో సెలవురోజులను చూసుకుంటే..

జనవరి 2020 లో బ్యాంక్ సెలవుల జాబితా

♦ జనవరి 1 - న్యూఇయర్

♦ జనవరి 5 - ఆదివారం

♦ జనవరి 11 - రెండో శనివారం

♦ జనవరి 12 - ఆదివారం

♦ జనవరి 14 - భోగి

♦ జనవరి 15 - మకర సంక్రాంతి

♦ జనవరి 19 - ఆదివారం

♦ జనవరి 25 - నాల్గవ శనివారం

♦ జనవరి 26 - రిపబ్లిక్ డే / ఆదివారం


Tags:    

Similar News