Bandi Sanjay: నేడు ఢిల్లీ వెళ్లనున్న బండి సంజయ్‌

Bandi Sanjay: ఢిల్లీకి రావాలంటూ బండి సంజయ్‌కు బీజేపీ అధిష్టానం పిలుపు

Update: 2023-05-17 04:02 GMT

Bandi Sanjay: నేడు ఢిల్లీ వెళ్లనున్న బండి సంజయ్‌

Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తినకు ఇవాళ పయనం కానున్నారు. హైకమాండ్ నుంచి పిలుపొచ్చిన నేపథ్యంలో బండి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఇప్పటికే హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం హస్తిన పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

కర్ణాటక ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో పార్టీ డీలా పడకూడదనే ఉద్దేశంతోనే తెలంగాణ నేతలతో హైకమాండ్ మంతనాలు జరపనున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ బీజేపీ నేతల మధ్య వర్గపోరుపైనా బీజేపీ హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ ఇష్యూలోనూ బీజేపీ అధినేతలు తెలంగాణ సారథులతో చర్చించే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News