Bandi Sanjay: రేపటి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తాం

Bandi Sanjay: సీఎం రేవంత్ వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రం పరువుపోయిందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్.

Update: 2025-05-06 08:05 GMT

Bandi Sanjay: రేపటి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తాం

Bandi Sanjay: సీఎం రేవంత్ వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రం పరువుపోయిందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. కుటుంబ పెద్ద చేతులెత్తేస్తే కుటుంబం పరిస్థతి ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిందిపోయి.. అధైర్యం నింపుతారా అని నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికొదిలేశారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం నడపలేమనే స్థితిలో కాంగ్రెస్‌ ఉందని బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే అడ్డగోలు హామీలు ఇచ్చారని.. ఇప్పుడు ఆరు గ్యారంటీలు అమలు చేయలేమని చేతులెత్తేశారని విమర్శించారు. కేంద్రమంత్రులు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని సీఎం చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. రేపటి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీస్తామన్నారు. సంవిదాన్ చేతపట్టి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయన్నారు.

Tags:    

Similar News