Bandi Sanjay: ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బిఆర్ఎస్ కనుమరుగు

Bandi Sanjay: మోదీ 9 యేళ్ల పనితీరును ప్రజలకు వివరించే ప్రయత్నం

Update: 2023-06-19 02:04 GMT

Bandi Sanjay: ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బిఆర్ఎస్ కనుమరుగు

Bandi Sanjay: నాగర్ కర్నూల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తెలిపారు. నాగర్ కర్నూలులో నిర్వహించిన బిజెపినాయకుల సన్నాహక సమావేశంలో బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. మోదీ 9 యేళ్ల పనితీరును ప్రజలకు వివరిస్తామన్నారు. లక్షమందితో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా బిజెపి వ్యూహాత్మకంగా పనిచేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో స్వార్థ రాజకీయాలకు పాకులాడే కాంగ్రెస్ పార్టీ, అవినీతి అక్రమాలతో కాలంగడుపుతున్న కేసీఆర్ సర్కార్ కనుమరుగవుతారనే అభిప్రాయం వ్యక్తంచేశారు.

Tags:    

Similar News