Baby Born with Two Teeth: పుట్టుక‌తోనే శిశువుకి రెండు దంతాలు

Baby Born with Two Teeth: శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వారి కాలజ్ఞానంలో చెప్పిన కొన్ని వింతలు అప్పుడప్పుడు వింటూనే ఉంటాం.

Update: 2020-07-09 12:00 GMT
Representational Image

Baby Born with Two Teeth: శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వారి కాలజ్ఞానంలో చెప్పిన కొన్ని వింతలు అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. మనిషి రూపంలో జంతులు పుట్టడం, అప్పుడే పుట్టిన పిల్లలు నడవడం, వేప చెట్టుకు పాలు రావడం ఇలాంటి ఎన్నో వింతలు విన్నాం. ఇప్పుడు ఇలాంటి వింతే తెలంగాణ రాష్ట్రంలోనూ జరిగింది. ఈ వింతను చూసిన వారు ఆశ్చర్యపోక తప్పదు. అసలు ఏంటి వింత ఏం జరిగింది అనుకుంటున్నారా. అయితే ఈ వింత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా అప్పుడే పిల్లలు పుట్టిన నవ్వితే బోసి నవ్వులతో భలే ముద్దొస్తుంటారు. అయితే ఆ బోసి నవ్వుల చిన్నారి పాపాయికి దంతాలు రావాలంటే సుమారు ఆరు నుంచి పన్నెండు నెలల మధ్యలో సమయం పడుతుంది. కానీ ఓ చిన్నారికి మాత్రం పుట్టుకతోనే దంతాలు ఉన్నాయి.

ఏంటి అప్పుడే పుట్టిన చిన్నారిని దంతాలు ఉండడం ఏంటి అనుకుంటున్నారా అది నిజమే.. జోగులాంబ గద్వాలలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో పురుడు కోసం ఓ నిండు గర్భిణి అడ్మిట్ అయింది. ఆమె పరిస్ధితిన అర్థం చేసుకున్న వైద్యులు ఆమెకు నార్మల్ డెలివరీ కాదని తలచి ఆపరేషన్ చేసారు. దీంతో ఆ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ అప్పుడే పుట్టిన శిశువుకు రెండు దంతాలు ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించిన డాక్టర్ విజయభాస్కర్ రెడ్డితో పాటు వైద్య సిబ్బందికూడా ఒక్క సారిగా ఆశ్చ‌ర్య‌పోయామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నార‌ని తెలిపారు డాక్ట‌ర్లు. ఇదే తరహాలో రెండు మూడేళ్లక్రితం బ్రెజిల్ లో కూడా ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టి శిశువు బుడి బుడి అడుగులు వేస్తే ఆస్పత్రి సిబ్బందిని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.


Tags:    

Similar News