ములుగు జిల్లాలో ఓ యువతిపై అత్యాచారయత్నం

*అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేసిన యువకుడు.. తప్పించుకుని బంధువులకు ఫోన్ చేసిన యువతి

Update: 2022-10-09 08:24 GMT

ములుగు జిల్లాలో ఓ యువతిపై అత్యాచారయత్నం

Mulugu: ఆటో కోసం ఎదురు చూస్తున్న ఓ యువతి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని... అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్రం చేశాడో ఘనుడు.. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో జరిగింది. ఓ యువతిని నమ్మించి ఆటోలో లిఫ్ట్ ఇస్తానని చెప్పిన... శ్రీరామ్ నగర్ గ్రామానికి చెందిన కృష్ణతేజ.... అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. అయితే ఆ యువకుడి నుంచి తప్పించుకున్న ఆ యువతి బంధువులకు ఫోన్ చేసిన విషయం చెప్పింది. దీంతో బంధువులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Full View
Tags:    

Similar News